రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ KGF-2. ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను మార్చి 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం కేవలం కన్నడ ప్రేక్షకులే కాకుండా సినీ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం KGF-2 మూవీ యూనిట్ సాంగ్ కోరుకుంటున్నారా? ట్రైలర్ కోరుకుంటున్నారా? అని పోల్ కండక్ట్ చేయగా.. చాలా మంది సాంగ్ కావాలని రిప్లై ఇచ్చారు. దీంతో సాంగ్‌ను మార్చి 21న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ను ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.