KGF 2 విడుదలై రేపటితో నెల రోజులు. అయినా కానీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. మరోవైపు ఈ చిత్రం దేశీయ, అంతర్జాతీయ సర్క్యూట్‌లలో కూడా రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్2 దక్షిణ కొరియాలో ప్రదర్శించబడుతున్న తొలి కన్నడ చిత్రంగా నిలిచింది. దక్షిణ కొరియాకు చెందిన ఓ అభిమాని ఇలా పేర్కొన్నాడు. KGF చాప్టర్ 2 షోలు పరిమితంగా ఉన్నప్పటికీ.. కొరియాలో భారీ విజయాన్ని సాధించిందని తెలిపాడు. దీంతో రాకీ భాయ్ కథ కొరియన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, యష్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్ ఇతర పాత్రలు పోషించారు.