ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ నటించిన కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా KGF చాప్టర్2 రూపుదిద్దుకుంటోంది. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్ అనే సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇప్పటికే అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం. కాగా, ఇంతకుముందు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల హక్కులను ఇదే సంస్థ రూ.65 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇంతటి భారీ డీల్ అందుకున్న ఘనత ప్రస్తుతం కేజీఎఫ్2, సలార్ చిత్రాలకే దక్కింది.