‘KGF’ పెద్ద సక్సెస్ కావడంతో ‘KGF2’ మూవీపై ఆసక్తి పెరిగింది. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని వేచి చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే వారికి గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. ‘కేజీఎఫ్2’ ట్రైలర్ మార్చి 27న సాయంత్రం 6.40 గంటలకు రాబోతుందని ప్రకటించింది. కన్నడ హీరో యశ్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్ అధీర అనే క్రూరమైన విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్ 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.