ఎన్నికల ఫలితాలపై ఖర్గే స్పందన – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల ఫలితాలపై ఖర్గే స్పందన – YouSay Telugu

    ఎన్నికల ఫలితాలపై ఖర్గే స్పందన

    December 8, 2022

    © ANI Photo(file)

    హిమాచల్‌ ప్రదేశ్‌లో గెలుపు, గుజరాత్‌లో ఘోర పరాభవంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తమ పార్టీని గెలిపించిన హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. ప్రియాంకా గాంధీ, రాహుల్ పాదయాత్ర వల్లే గెలుపు సాధ్యమైందని ఆయన చెప్పారు. ఇక గుజరాత్‌లో ఘోర పరాభవంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమన్నారు. లోటుపాట్లను గుర్తించి ముందుకెళ్తామని, నైతిక సిద్ధాంతాలతో పోరాటం కొనసాగిస్తామని ఖర్గే వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ మెజారిటీ(35) మార్కు‌ని దాటేసింది.

    Exit mobile version