ఖతర్నాక్ దొంగ అరెస్టు..2 కిలోల గోల్డ్ స్వాధీనం

© File Photo

51 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ఖతర్నాక్ దొంగని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన సంతోష్ నుంచి 2 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు చెప్పిన వివరాలు విన్న పోలీసులు షాక్ అయ్యారు. రోజు తెల్లవారు జామున చైన్ స్నాచింగ్ చేయకపోతే రాత్రి నిద్రపట్టదని నిందితుడు సంతోష్ తెలిపాడు. బైక్‌కు నకిలీ నంబర్‌ ప్లేట్‌తో హెల్మెట్ ధరించి ఒంటరి మహిళల నుంచి చైన్స్ దొంగతనం చేసేవాడని పేర్కొన్నాడు. మరోవైపు సంతోష్‌కు సహకరించిన నిందితుడు రవిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సంతోష్ హెల్మెట్ తీయకుండా చోరీలు చేయడం వల్ల అతన్ని పట్టుకునేందుకు 4 ఏళ్ల నుంచి పోలీసులు వెతుకుతున్నట్లు తెలిసింది.

Exit mobile version