‘షేర్షా’ మూవీలో కలిసి నటిస్తున్నప్పుడు కియారా అద్వాణి-సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో పడ్డారు. వాళ్లిద్దరూ బయట పార్టీలకు వెళ్తూ చాలాసార్లు కెమెరా కంటికి చిక్కారు. అయితే ఇటీవల వాళ్లిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీలో ఇద్దరూ మళ్లీ కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది. పార్టీ సమయంలో అందరూ డ్యాన్స్ చేస్తుండగా వారిద్దరూ హగ్ చేసుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో కరణ్ జోహార్ వాళ్లిద్దరి మధ్యలో వచ్చిన మనస్పర్థలను తొలగించి ఈ కపుల్‌ను మళ్లీ కలిపాడని సమాచారం.