బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా హోలీ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకొన్నారు. రంగుల కేలీలో మునిగి పోయి తమదైన లోకంలో విహరించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కియారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు ‘వావ్.. బ్యూటిఫుల్.. హ్యాపీ కపుల్స్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కియారా, సిద్ధార్థ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న వీరిద్దరూ తమ బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. షేర్‌షా సినిమాతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.