స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్స్ చేరాడు. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండర్స్ ఆంటోన్సెన్పై విజయం సాధించాడు. కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత మూడో టోర్నమెంట్ ఆడుతున్న ఏడో సీడ్ శ్రీకాంత్ 21-19, 19-21, 22-20తో ఆంటోన్సెన్పై గెలుపొందాడు. ఇక తర్వాత మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన జొనాటన్ క్రిస్టీతో తలపడనున్నాడు.