ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన ముప్పేట దాడి 14వ రోజుకు చేరుకుంది. ఈ దాడిలో భాగంగా ఉక్రెయిన్లోని పలు ప్రధాన నగరాలను కైవసం చేసుకున్న రష్యా, తాజాగా సుమీ నగరాన్ని కూడా హస్తగతం చేసుకుంది. ఇప్పటికే ఆ నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న రష్యా సేనలు కొన్ని గంటల్లోనే ఆ నగరాన్ని స్వాధీనం చేసుకునేలా కనిపిస్తుంది. కాగా ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిని ఖండిస్తూ అమెరికా వరుసగా కఠిన ఆంక్షలు విదిస్తుంది. అటు కోకా కోలా, పెప్సీ కంపనీలు కూడా రష్యాలో తమ వ్యాపారం మూసేస్తున్నట్లు ప్రకటించాయి.