ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. భర్తకు మితిమీరిన మోతాదులో మందులు ఇచ్చి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి తనపేరు మీద రాస్తాడో లేదో అనే అనుమానంతో ప్రియుడితో కలిసి హతమార్చింది. కల్యాణ్‌పుర్ శివ్లి రోడ్డు ప్రాంతానికి చెందిన రిషబ్ దుండగులు దాడిలో గాయపడి చికిత్స పొంది డిశ్చార్చి అయ్యాడు. రెండ్రోజులకే చనిపోవగా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మందులు ఎక్కువగా ఇచ్చారని తెలియడంతో విషయం బయటపడింది.