‘కిల్కారీ’ అంటే ‘చిన్నారి చిరునవ్వు’. గర్భిణులు, బాలింతల కోసం కేంద్రం ప్రారంభించిన ఈ నూతన వ్యవస్థ ఏపీలో అమలులోకి వచ్చింది. మాతా శిశుమరణాల నియంత్రణలో భాగంగా కేంద్రం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి బిడ్డ పుట్టిన ఏడాది దాకా… సమస్త సమాచారాన్ని అందించనున్నారు. అవసరమైన సమాచారాన్ని 0124458000 నంబరు ద్వారా వారానికోసారి ఉచితంగా సెల్ఫోన్లకు అందిస్తున్నారు. ఒకవేళ వినలేకపోతే.. 14423 నంబరుకు కాల్చేసి వినొచ్చు.