దిల్లీలోని ఖ్యాలా ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. చలిమంట దగ్గర తలెత్తిన చిన్న గొడవలో ఓ 15 ఏళ్ల బాలుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుమిత్తో పాటు మరో ఇద్దరు బాలురను పోలీసులు అందుపులోకి తీసుకున్నారు. సుమిత్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ‘తొలుత సుమిత్ అతని స్నేహితులు చలిమంట వేసుకుని కూర్చున్నారు. అక్కడికి వెళ్లిన బాధిత బాలుడు తనకు మంట దగ్గర కొంత స్థలం కావాలని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది.