సాయం చేసిన స్నేహితుడినే చంపేశారు!

© Envato

స్నేహితుడు తవ్విన గుంతలో అతడినే పూడ్చిచంపిన దారుణ ఘటన హైదరాబాద్ పటాన్‌చెరు పరిధిలో వెలుగుచూసింది. గౌతంనగర్‌ కాలనీకి షేక్‌ ఇలియాస్‌, రుస్తుం అలీ, అల్లావుద్దీన్‌లు స్నేహితులు. ఇలియాస్‌, సమీర్‌కు రూ.50వేల అప్పు విషయంలో గొడవలున్నాయి. దీంతో అలీ, అల్లావుద్దీన్‌తో కలిసి సమీర్‌ను హత్య చేయాలని సమీర్‌ పన్నాగం పన్నాడు. ఈ నెల 8న ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటూ పటాన్‌చెరు శివారులో సమీర్‌ సాయంతో గుంత తవ్వారు. మర్నాడు మృతదేహం రాలేదు తవ్విన గుంతలు పూడ్చేద్దాం అంటూ సమీర్‌ను పిలిచాడు. ఈ క్రమంలోనే సమీర్‌ తలపై అల్లావుద్దీన్‌ ఇనుపరాడ్డులో బలంగా కొట్టాడు.అతడు గుంతలో పడిపోగా, ఇలియాస్‌ నాలుగు గ్రానైట్‌ రాళ్లను మీద పడేసి అందులోనే పూడ్చేశాడు.

Exit mobile version