యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో సినిమా చేసేందుకు ఈ హీరోకు అవకాశం లభించింది. పుష్ప, సర్కారు వారి పాట వంటి భారీ సినిమాలు చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ, రాజావారు రాణివారు,ఎస్.ఆర్ కళ్యాణమండపం, సెబాస్టియన్ వంటి వరుస హిట్స్ కొట్టిన కిరణ్ అబ్బవరంతో రూ.9 కోట్ల బడ్జెట్‌తో ఒక సినిమాను చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.