కేంద్రంపై కవిత, కేటీఆర్ చేసిన విమర్శలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇద్దరూ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. లిక్కర్ కేసులో ఓ మహిళ ఉండటం నేనేప్పుడు చూడలేదు. మద్యం కేసు రాగానే మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తొచ్చిందా? ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదు. భారస సర్కారులో ఒక్క మహిళా మంత్రి లేదు. రాజ్యసభలో ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు. కేవలం సానుభూతి కోసం విమర్శలు చేస్తున్నారు” అని విమర్శించారు.