ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రైతులను టీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ చదరంగంలో రైతులకు అన్యాయం చేస్తున్నారని మండి పడ్డారు. రా రైస్ చివరి గింజ వరకు కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. పంజాబ్ రాష్ట్రం నుంచి ఏటా ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం ధాన్యం కొంటుందన్నారు. కుటుంబ రాజకీయాల కోసం రైతుల్ని బలి చేయవద్దని సూచించారు. ఇంతవరకు ఎంత పంట సాగు చేశారో, ఎంత ధాన్యం ఇస్తారో చెప్పలేదని కేంద్ర మంత్రి అన్నారు.