ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీస్‌లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? లిక్కర్ వ్యాపారం చేశారు. అక్రమ సంపాదన చేసింది మీరే. ఢిల్లీలో అక్రమ పాలసీలో భాగస్వామ్యం అయి ధనార్జన చేశారు.ఈడీ నోటీస్‌లతో మాకు సంబంధం లేదు. లిక్కర్ ఏరులై పారుతోంది. ఊళ్ళలో 24 గంటల బెల్ట్ షాప్ లు తెరిచే ఉంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఉన్న ముగ్గురు పార్టీ ఫిరాయించిన వారే.ఎన్నికలను పూర్తిగా కలుషితం చేశారు. మహిళ గవర్నర్‌కు ప్రోటోకాల్ లేకుండా అవమానపరుస్తున్నారు అని కిషన్ రెడ్డి విమర్శించారు.