న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మెుదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా… కివీస్‌కు 386 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మెరుపు సెంచరీలతో బౌలర్లను ఆటాడించారు. హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ కొట్టడంతో స్కోరు 385 పరుగులకు చేరింది. న్యూజిలాండ్‌లో కాన్వే సెంచరీతో రాణించాడు. శార్దూల్ థాకూర్ మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.