ప్రముఖ బాలీవుడ్ గాయకుడు KK కృష్ణకుమార్ కున్నాత్ గుండెపోటు కారణంగానే మరణించినట్లు ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. మయోకార్డియల్ కారణంగానే గాయకుడు మరణించాడని ప్రాథమిక పోస్టు మార్టం నివేదిక పేర్కొంది. అతని మరణం వెనుక ఎలాంటి హత్యా ప్రయత్నం లేదని వెల్లడించింది. క్లినికల్ పరీక్షలో గాయకుడికి దీర్ఘకాలంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలిందని వైద్యులు తెలిపారు. పోస్టు మార్టం తుది నివేదిక 72 గంటల తర్వాత అందుబాటులో వస్తుందని వెల్లడించారు. మరోవైపు కేకే మృతి చెందిన సమయంలో పలు చోట్ల గాయాలు ఉండటం పట్ల పోలీసులు అనుమానిస్తున్నారు.