టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వివాహానికి తేదీ ఫిక్స్ అయింది. జనవరి 23న ప్రేయసి అతియా శెట్టితో రాహుల్ ఏడడుగులు నడవబోతున్నాడు. అతియా తండ్రి సునీల్ శెట్టి నివాసమే వీరి వివాహానికి వేదిక కాబోతోంది. మరీ అంత ఆర్భాటాలు లేకుండా ఈ నెల 21 నుంచి 23 వరకు వివాహ వేడుకలు జరుగుతాయని సునీల్ శెట్టి వెల్లడించారు. వేడుకలు సినీ, క్రీడా ప్రముఖులు హాజరు కాబోతున్నారు.