ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ పథకం కింద మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలను త్వరలో చేర్చేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఈ మేరకు ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దీనికింద తుంటి కీలు మార్పిడి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మోకీలు నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరగుతున్నందునా అన్ని శస్త్ర చికిత్సలు చేర్చాలని నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.