ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ ఎందుకు చనిపోయాడో తెలుసని….తనకు అన్ని విషయాలు చెప్పాడని పేర్కొన్నారు. ఇప్పుడు వాటి గురించి ప్రస్తావించటం సరైంది కాదన్నారు. తాను చనిపోయేలోపు వెల్లడిస్తానని తెలిపారు. అహింస చిత్రం ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన తేజ…రెండు హిట్ల తర్వాత ఉదయ్ కిరణ్ బ్యాలెన్స్ తప్పాడని వ్యాఖ్యనించారు. దానివల్ల సమస్యలు ఎదుర్కొన్నాడని వివరించారు. అతడి జీవితంలో ఏం జరిగిందో అంతా తెలుసన్నారు.
ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో తెలుసు: తేజ
