• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐదో బ్యాట్స్‌మన్‌గా అవతరించిన కోహ్లీ

    శ్రీలంకతో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. మూడో వన్డేలో చేసిన 166 రన్స్‌తో కోహ్లీ వన్డే కెరీర్‌లో 12,754 పరుగులు సాధించాడు. దీంతో 12,650 పరుగులతో ఐదో స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ ప్లేయర్ జయవర్దనేని దాటేశాడు. 448 ఇన్నింగ్సుల్లో జయవర్దనే 12,650 పరుగులు చేయగా.. కోహ్లీ కేవలం 268 ఇన్నింగ్సుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. తొలిస్థానంలో సచిన్(18,426) ఉండగా, సంగక్కర(14,234), పాంటింగ్(13,704), జయసూర్య(13,430) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.