పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 2019 ఆగస్టు తర్వాత వన్డేల్లో మరో సెంచరీ చేశాడు. ఇప్పటికే ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించగా తనకు సహకరిస్తూనే ధాటిగా ఆడాడు. తనదైన స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ ఫోర్లతో అలరించాడు. కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా తర్వాత పుంజుకున్నాడు. అప్పట్లో కోహ్లీ ఫామ్‌పై విమర్శలు రాగా…కొద్దిరోజులుగా వాటిని పటాపంచలు చేస్తున్నాడు. బంగ్లాతో మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది.