మరో రికార్డుకు చేరువలో కోహ్లి

© ANI Photo

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. ద్రావిడ్ అన్ని ఫార్మాట్లలో కలిపి 509 మ్యాచ్‌ల్లో 24,208 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి 478 మ్యాచ్‌ల్లో 24,002 పరుగులు సాధించాడు. మరో 227 పరుగులు సాధిస్తే ద్రావిడ్ రికార్డును కోహ్లి అధిగమించనున్నాడు. కోహ్లి ఈ రికార్డు సాధిస్తే ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో ఆరో స్థానంలో నిలిచి మరో ఘనత సాధిస్తాడు.

Exit mobile version