ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టును అనారోగ్యంతో ఉన్నప్పటికీ కోహ్లీ ఆడాడని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కెప్టెన్ రోహిత్.. కోహ్లీ కొద్దిగా దగ్గుతున్నట్లు చెప్పాడు. అంతమాత్రాన అతడు అనారోగ్యంతో ఉన్నట్లు కాదని పేర్కొన్నాడు. అటు కోహ్లీతో భారీ భాగస్వామ్యం నమోదు చేసిన అక్షర్ సైతం దీనిపై స్పందించాడు. కోహ్లీ వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ఇబ్బంది పడలేదని పేర్కొన్నాడు. తనకైతే కోహ్లీ అనారోగ్యంగా ఉన్నట్లు అస్సలు అన్పించలేదని స్పష్టం చేశాడు. కాగా, 186 పరుగులు చేసిన కోహ్లీ కెరీర్‌లో 75 శతకం నమోదు చేశాడు.