విరాట్ కోహ్లీ తప్పకుండా 100 సెంచరీల మార్కును చేరుకోగలడని టీమిండియా మాజీ ప్లేయర్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఏడాదికి సగటుగా 6-7 సెంచరీలు చేస్తే సచిన్(100) రికార్డును సమం చేయగలడని గవాస్కర్ తెలిపాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ని ఇలాగే కొనసాగించాలని సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ 74 సెంచరీలతో అత్యధిక శతకాలు బాదిన బ్యాట్స్‌మన్‌గా రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ వయసు 35. మెరుగైన ఫిట్నెస్ విరాట్ సొంతం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే కోహ్లీ మరో ఐదారేళ్ల పాటు ఆడగలడు. ఆ సమయంలో 100 సెంచరీల మార్క్ అందుకుంటాడో? లేదో వేచి చూడాల్సిందే.