కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన వద్దకు నిన్న బీజేపీ నేతలు తరుణ్ చుగ్, బండి సంజయ్ వెళ్లి మంతనాలు జరిపారు. జూలై 2 వ తేదీన మోదీ హైదరాబాద్ కు రానున్న తరుణంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డితో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందుతోంది.