మెగా ఫ్యాన్స్‌ అంచ‌నాల‌ను పెంచిన కొర‌టాల శివ‌

సామాజిక కోణంలో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని క‌మ‌ర్షియ‌ల్ మూవీగా తీర్చిదిద్దుతాడు కొర‌టాల శివ‌. మిర్చి, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను సినిమాలు అలాంటివే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ తెర‌కెక్కించాడు. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే దీని గురించి తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన కొర‌టాల శివ మెగాస్టార్‌ను, రామ్‌చ‌ర‌ణ్‌ను ఒకేసారి తెర‌పై చూస్తుంటే క‌న్నుల పండుగ‌లో ఉంటుంద‌ని చెప్పాడు. దీంతో మెగాఫ్యాన్స్‌లో మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేశాడు. దీని త‌ర్వాత ఎన్‌టీఆర్ 30 మూవీ గురించ చ‌ర్చించాడు. జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని పేర్కొన్నాడు. ఒక బ‌ల‌మైన క‌థ‌ను తెర‌పై చూపించబోతున్నాం అని ఫ్యాన్స్‌కి గ్యారంటీ ఇచ్చాడు.

Exit mobile version