హ్యాపీ బర్త్ డే కొరటాల శివ (జూన్ 15)

Screengrab Instagram:

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ బర్త్ డే ఇవాళ. 15 జూన్, 1975న ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకాని ప్రాంతంలో శివ జన్మించాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గల కుటుంబంలో జన్మించిన కొరటాల మొదట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. ఆ తర్వాత తన మామ పోసాని కృష్ణ మురళి దగ్గర సినిమాలకు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్‌గా చేరాడు. ఈ క్రమంలోనే ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో మిర్చి (2013) మూవీతో మొదటగా దర్శకత్వం ప్రారంభించాడు. తర్వాత శ్రీమంతుడు (2015), జనతా గ్యారేజ్ (2016), భరత్ అనే నేను (2018), ఆచార్య (2022) వంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అందించి పలు అవార్డులు కూడా అందుకున్నాడు.

Exit mobile version