మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గత 24 గంటల్లో చేపట్టిన శాంపిల్స్ పరీక్షల్లో కనీసం 0.01 శాతం పాజిటివ్ కేసులు కూడ నమోదు కాలేదు. అలాగే నాగపూర్ జిల్లాలో వరుసగా 4వ రోజు, యవత్మాల్లో వరుసగా 7వ రోజు సున్నా కేసులు నమోదు అయ్యాయి. నాగపూర్, వార్దా, చంద్రపూర్, అమరావతి డివిజన్లలో 4512 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 0.06 శాతం మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.