ఒమిక్రాన్ వేరియంట్లను కోవోవ్యాక్స్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని సీరం సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. ఈ టీకాకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని వెల్లడించారు. మరో 10 రోజుల్లో అనుమతి రావచ్చొని పేర్కొన్నారు. దీనిని బూస్టర్ డోసుగా పరిగణించవచ్చంట. కోవోవ్యాక్స్ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్. పిల్లలు, పెద్దలు కొన్ని నిబంధనలతో వేయించుకోవాలని అప్పట్లోనే కేంద్రం సూచించింది. నోవోవాక్స్, సీఈపీఐ సంయుక్తంగా ఈ కోవోవ్యాక్సిను రూపొందించాయి. ఇది మన శరీరంలో రోగ నిరోధక కణాలు గుర్తించి ఇమ్మూనిటీని ఇస్తుంది.