నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతీ కో-ఆపరేటివి లిమిలిడ్ (క్రిబ్కో) ఆద్వర్యంలో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభం కానుంది. నిన్న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(SIPB) సమావేశం జరిగింది. ఇందులో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 100 ఎకరాల్లో రూ.560 కోట్లతో 250 కె.ఎల్.డీ సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేయనున్నారు. దీంతో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కూడా లభించనున్నట్లు తెలిపింది.