కృష్ణా నదికి పొటెత్తుతున్న వరద

© ANI Photo

కృష్ణానదికి వరద భారీగా పొటెత్తుతోంది. కృష్ణమ్మపై నిర్మించిన అన్ని జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 4,36,896 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. పది గేట్లను ఎత్తివేసిన అధికారులు 4,47,896 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 884.40 అడుగులు చేరుకుంది. గరిష్ఠస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను 212.4385 నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమగట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

Exit mobile version