తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు ఉప్పల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మల్లాపూర్‌లో ఉప్పల్ థీమ్ పార్క్, వైకుంఠ ధామం ప్రారంభించిన మంత్రి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్, నాచారంలో సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్, రామాంతపూర్‌లో ఆయకట్టు నాలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని, హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోందని, తద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్నామని మంత్రి చెప్పారు.