కేంద్రం తీరుపై మళ్లీ మండిపడ్డ కేటీఆర్

Screengrab Twitter:

కేంద్రం తీరుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఏం తినాలో, ఏం వినాలో కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంధన, గ్యాస్ ధరలు పెరిగి దేశంలో దారుణ పరిస్థితి నెలకొందన్నారు. సమస్యల దృష్టి మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టడీ మెటీరియల్ పంపిణీ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాలే లక్ష్యం ఏర్పడ్డ తెలంగాణను 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

Exit mobile version