బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హమీల పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం అంతరిక్ష సమస్యనా అని ప్రశ్నించారు. మెస్ కాంట్రాక్టర్‌ను ఎందుకు మార్చలేదని…ఏదైనా ఇబ్బంది అయితే పోలీసుల సహకరారం తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు వెల్లడించారు. ట్రిపుల్‌ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రులు…2 వేల 200 మందికి ల్యాప్‌టాప్‌లు అందించారు.