ప్రధాని మోదీపై కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రానికిచ్చే నిధుల కొరత.. అన్ని సమస్యలకు మూలం పీఎం మోదీకి విజన్ కొరత’ అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డాడు. భాజపా ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని తనదైన శైలిలో విమర్శించారు.