• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణ ఐటీ రంగం 26.14 శాతం వృద్ధి: కేటీఆర్

    తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT)రంగం ఎగుమతుల్లో 26.14 శాతం వృద్ధిని నమోదు చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత సంవత్సరంలో ఎగుమతుల్లో వృద్ధి 12.98 శాతంగా ఉందని చెప్పారు. రాష్ట్రం 2020-21లో రూ. 1,45,522 కోట్ల నుంచి రూ. 1,83,569 కోట్ల ఐటీ/ఐటీఈఎస్ ఎగుమతులు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. కరోనా సహా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వృద్ధిని సాధించడం విశేషం. మరోవైపు 2021-22లో దాదాపు 1.50 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించి 23.78 శాతం ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. 2021-22లో దేశవ్యాప్తంగా ఈ రంగంలో 4.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని నాస్కామ్ అంచనా వేయగా, ఒక్క తెలంగాణలోనే 33.3 శాతం ఉపాధి వృద్ధిని సాధించిందని మంత్రి అన్నారు.