హైదరాబాద్- కొత్తగూడ నిర్మించిన నూతన ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధిలో భాగంగా రూ. 263 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పోడవుతో ప్లై ఓవర్ నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంతో కొండాపూర్, గచ్చిబౌలి వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.3కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ఫ్లై ఓవర్‌కు అనుబంధంగా 470 మీటర్ల పొడవు… 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్ నిర్మించారు.నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం మొత్తం 47 ప్లైఓవర్ నిర్మాణాలను చేపట్టింది. వీటిలో ఇప్పటివరకు 18 పూర్తయ్యాయి.