మంత్రి కేటీఆర్ నేడు హుజుర్నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హుజుర్నగర్ చేరుకుని గ్రీన్వుడ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మునుగోడులోని చండూర్కు చేరుకుంటారు. గట్టుప్పల్లోని క్లస్టర్ డెవలప్మెంట్ పొగ్రాంను ప్రారంభిస్తారు. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం తర్వాత కేటీఆర్ తొలిసారి అక్కడ పర్యటించనున్నారు.