విశాఖ జిల్లాలో ఓ మహిళ దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న ఇంట్లోని ఓ డ్రమ్ములో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యింది. మధురవాడ వికలాంగుల కాలనీలోని ఇంట్లో కుటుంబం నివసిస్తూ ఉండేది. కొంతకాలంగా వారి ఆచూకీ లేదు. దాదాపు సంవత్సరంపాటు ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని వెళ్లాడు. అందులో ఉన్న డ్రమ్ములో మృతదేహాన్ని గుర్తించారు.భర్తే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.