రేపు సాయంత్రం 6 గంటలకు KVV ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈనెల 23వ తేదీన విడుదల కానున్న ‘కృష్ణ వృింద విహారి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు(సెప్టెంబర్ 20న) సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ హాలులో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మూవీలో హీరోగా నాగశౌర్య నటిస్తుండగా, హీరోయిన్‌గా షిర్లీ సెటియా నటిస్తోంది. అనీష్ కృష్ణ డైరెక్టర్.

Exit mobile version