హైదరాబాద్లో రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల KYC పేరుతో మోసాలు పెరుగుతున్నట్లు చెప్పారు. ‘మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం. మీ KYC గడువు నేటితో ముగిసిపోతుంది. మీ KYC అప్డేట్ చెయ్యడానికి వెంటనే ఈ నెంబరుకి కాల్ చేయండి’ అంటూ ఫొన్లకు ఫెక్ SMSలు వస్తున్నాయని తెలిపారు. అలా వచ్చే SMS లేదా కాల్కు స్పందించవద్దని సూచించారు. ఇలా కాల్, మెసెజ్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖాళీ చేస్తున్నారని హెచ్చరించారు.బ్యాంకులు కాల్ చేసి ఎలాంటి వివరాలు అడగవని చెప్పుకొచ్చారు.
-
Courtesy Twitter: hyd police
-
Courtesy Twitter: hyd police