ట్రెక్కింగ్ చేస్తూ 1000 అడుగుల ఎత్తులో చిక్కుకున్న మ‌హిళ‌

© Envato

కొంత‌మంది ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటివాళ్లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశ‌ముంది. తాజాగా బీహార్ లోని నలంద జిల్లా రాజ్​గీర్​లో ఓ మ‌హిళ‌ ట్రెక్కింగ్ చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. నేచ‌ర్ స‌ఫారీ పార్క్ లో జిప్ లైన్ ట్రెక్కింగ్ చేసేందుకు బ‌యల్దేరి అటువైపు ఉన్న‌ స్తంభం నుంచి తాడు సాయంతో ఇటువైపు స్తంభం వైపు దూసుకొచ్చింది. ఈ క్ర‌మంలో అక్క‌డ ఆమెను దింపేందుకు సిబ్బంది ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమె ఆ స్తంభాన్ని ఢీకొట్టి తిరిగి వెనక్కి వెళ్లి 1000 అడుగుల ఎత్తులో గాల్లోనే చిక్కుకుపోయింది. చివ‌రికి సిబ్బంది రంగంలోని స‌ద‌రు మ‌హిళ‌ను కాపాడారు.

Exit mobile version