జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. ఒలింపిక్ స్వర్ణ విజేత విక్టర్ అక్సెల్‌సెన్‌ను 21-13, 12-21, 22-20 తో మట్టికరిపించి ఫైనల్‌లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్‌లో, సేన్ మరో ఫైనలిస్టు థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్సర్న్‌తో తలపడతాడు.