ఆల్ ఇంగ్లాండ్ బ్యాండ్మింటన్ టోర్నీలో లక్ష్యసేన్ రికార్డు సృష్టించాడు. సెమీఫైనల్లో మలేషియాకు చెందిన లీ జియాపై 21-13, 12-21, 21-19 తేడాతో విజయం సాధించాడు. దీంతో సేన్ పురుషుల సింగిల్స్ లో ఆల్ ఇంగ్లాండ్ ఫైనల్స్‌కు చేరిన నాలుగో భారతీయుడిగా నిలిచాడు. ఫైనల్లో విక్టర్ అక్సెల్సెన్ తో నేడు (మార్చి 20న) తలపడనున్నాడు. ఈ టోర్నమెంట్ ఫైనల్లోకి ప్రవేశించిన లక్ష్యసేన్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.