ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఫైనల్ చేరిన భారత యువ షట్లర్ లక్ష్యసేన్ డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్, వరల్డ్ నెం1 షట్లర్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఎన్నో అంచనాలతో ఫైనల్ పోరును మొదలుపెట్టిన లక్ష్యసేన్ విక్టర్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చతికిల పడ్డాడు. తొలి రెండు సెట్లను కోల్పోయి మ్యాచును చేజార్చుకున్నాడు. 21-10, 21-15 తేడాతో మొదటి రెండు సెట్లు ఓడిపోయాడు.