పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు ప్రభుత్వం ప్రకటించిన భూమిని అందించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. బాగ్ హయత్‌నగర్‌లోని సర్వేనంబర్ 159లో సుమారు 600 గజాలు ప్రభుత్వం కేటాయించనుంది. ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఆదివారం పరిశీలించి చదును చేయించారు. త్వరలోనే మొగిలయ్యకు భూమిని అందించనున్నారు.